Cm Jagan: జులై 4న చిత్తూరుకు సీఎం జగన్

by srinivas |   ( Updated:2023-06-29 13:52:01.0  )
Cm Jagan: జులై 4న చిత్తూరుకు సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జులై 4న చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా సీఎం పర్యటన ఏర్పాట్లను వైసీపీ నేతలు, అధికారులు పరిశీలించారు. ఉప ముఖ్య మంత్రి కె. నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి, ముఖ్యమంత్రి పర్యటనల రాష్ట్ర సలహాదారులు తలశిల రఘురాం, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, కలెక్టర్ సగిలి షన్మోహన్, జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి, చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎం.ఎస్ బాబు, ఎమ్మెల్సీ భరత్‌తో కలసి హెలిప్యాడ్, బహిరంగ సభ నిర్వహణ‌కు స్థలాల పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటు నిమిత్తం మెసానికల్ గ్రౌండ్, బహిరంగ సభ నిమిత్తం పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లను పరిశీలించారు.

Advertisement

Next Story