Kuppam: నన్ను జైల్లో పెట్టండి అందులో ఉంటా: చంద్రబాబు

by srinivas |   ( Updated:2023-01-04 13:44:32.0  )
Kuppam: నన్ను జైల్లో పెట్టండి అందులో ఉంటా: చంద్రబాబు
X
  • సైకో సీఎంకు ఒక రూలు.. నాకో రూలా
  • పోలీసుల తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపాటు

దిశ, డైనమిక్ బ్యూరో: పోలీసుల తీరుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్‌షోను నిలిపివేయాలంటూ ఆదేశించిన పోలీసులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 'నన్ను జైల్లో పెట్టండి.. అందులో ఉంటా. రాష్ట్రం మొత్తానికి బేడీలు వేస్తారా.. వేయండి' అంటూ చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'వైసీపీకి ఒక రూలు, నాకో రూలా..సమాధానం చెప్పండి' అని పలమనేరు డీఎస్పీని నిలదీశారు. సైకో సీఎంకు ఒక రూలు.. నాకో రూలా అంటూ మండిపడ్డారు. పోలీసులు మనసు చంపుకుని పనిచేస్తున్నారని చెప్పుకొచ్చారు. 'నేను రోడ్డుపై మాట్లాడుతున్నా.. రోడ్లు తవ్వట్లేదు' అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story