Naravaripalli: మనవళ్ల చేష్టలతో మురిసిపోతున్న చంద్రబాబు, బాలకృష్ణ

by srinivas |   ( Updated:2023-01-15 11:20:04.0  )
Naravaripalli: మనవళ్ల చేష్టలతో మురిసిపోతున్న చంద్రబాబు, బాలకృష్ణ
X

దిశ, వెబ్ డెస్క్: సంక్రాంతి సందర్భంగా నారా, నందమూరి కుటుంబాలు నారావారిపల్లెలో సందడి చేస్తున్నారు. భోగి ముందు రోజే నారావారిపల్లికు చేరుకున్న రెండు కుటుంబాలు ఉమ్మడిగా పండుగను ఎంజాయ్ చేస్తున్నారు. టీడీపీ అధినేత, బావ చంద్రబాబు స్వగ్రామానికి వెళ్లిన బాలకృష్ణ కుటుంబం పిల్లాపాపలతో కలిసి సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారు. నారా, నందమూరి కుటుంబ సభ్యులంతా ఒక్కచోట చేరటంతో అటు గ్రామం కూడా కళకళలాడుతోంది. ఇవాళ నాగాలమ్మ ఆలయంలో ఇరు కుటుంబాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, బాలయ్య తమ మనవళ్లతో సరదాగా కనిపించారు. తమ అల్లరితో ఇద్దరి తాతయ్యలను మనవళ్లు ఆటపట్టిస్తున్నారు. దీంతో మనవళ్లు చేస్తున్న చిలిపి చేష్టలను చూసి చంద్రబాబు, బాలకృష్ణ మురిసిపోయారు.

Advertisement

Next Story

Most Viewed