Tirumala: ఘాట్‌ రోడ్డులో రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు

by srinivas |
Tirumala: ఘాట్‌ రోడ్డులో రెయిలింగ్‌ను ఢీకొట్టిన కారు
X

దిశ, తిరుమల: తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే మొదటి ఘాట్ రోడ్డులో ప్రతి రోజు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఘాట్ రోడ్డులోని చివరి మలుపు వద్ద ఓ కారు అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొట్టిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం జరిగింది. కారు ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో అందులోని తెలంగాణకి చెందిన భక్తులు స్వల్ప గాయాలతో బయటపడారు. విషయం తెలుసుకున్న పోలీసులు వాహనాన్ని అలిపిరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story