ఆ హెడమాస్టర్ తీరు అర్ధం కావడం లేదు: ABVP

by srinivas |
ఆ హెడమాస్టర్ తీరు అర్ధం కావడం లేదు: ABVP
X

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా గూడూరు GSR మునిసిపల్ హైస్కూల్‌ హెడ్ మాస్టర్ తీరు సరిగా లేదని ఏవీబీపీ నాయకులు ఆందోళనకు దిగారు. 9వ తరగతి పాస్ అయిన 10 మంది విద్యార్థులను మళ్ళీ అదే తరగతి చదవాలని హెడ్ మాస్టర్ బెదిరించినట్లు విద్యార్థులు, తల్లిదండ్రులు చెప్పారని తెలిపారు. స్కూల్ హెడ్ మాస్టర్ పని తీరు సారిగా లేదని, విద్యార్థులను తిట్టడం, టీచర్స్‌తో అసభ్యకరంగా మాట్లాడుతున్నారని విద్యార్థులు చెప్పారన్నారు.. దీంతో స్కూల్ దగ్గరికి వెళ్లి ఆరా తీశామని, హెడ్ మాస్టర్ పద్ధతి సరిగా లేదని, టీచర్స్‌తో కూడా సరిగా మాట్లాడటం లేదని, అందరినీ అసహించుకుంటున్నారని తమకు తెలిసిందన్నారు. దీంతో హెడ్ మాస్టర్‌పై గూడూరు డిప్యూటీ డీఈఓకి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఫిర్యాదు తీసుకున్న అధికారులు.. హెడ్ మాస్టర్ పై ప్రభుత్వపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారని ఏబీవీపీ నాయకులు తెలిపారు. అటు జిల్లా విద్యా శాఖ అధికారికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ప్రభుత్వాలు చదువుకు పెద్ద పీట వేస్తుంటే ఈ ప్రధానోపాధ్యాయుడు మాత్రం నిబంధనలు అతిక్రమించి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రవర్తన మార్చుకుని ప్రధానోపాధ్యాయుడు మంచి ప్రవర్తనతో స్నేహ పూర్వక వాతావరణంలో విద్యార్థులకు చదువు చెప్పాలని ఏవీబీపీ నాయకులు డిమాండ్ చేశారు.

Advertisement

Next Story