Breaking: ఏసీబీ రైడ్స్.. ఇద్దరి అధికారుల వద్ద భారీగా ఆస్తుల గుర్తింపు

by srinivas |   ( Updated:2023-05-22 15:24:14.0  )
Breaking:  ఏసీబీ రైడ్స్.. ఇద్దరి అధికారుల వద్ద భారీగా ఆస్తుల గుర్తింపు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ అధికారుల ఇళ్లలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును బయటకు తీస్తున్నారు. ఇందులో భాగంగా చిత్తూరు పంచాయతీరాజ్ ఈఈ రుద్రరాజు రవి ఆస్తులపై ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. ఆయనకు సంబంధించిన ఇళ్లతో పాటు పలుచోట్ల సోదాలు నిర్వహించారు. కేజీకి పైగా బంగారం, 4.8 కిలోల వెండి వస్తులవును గుర్తించారు. అటు పార్వతీపురం పంచాయతీరాజ్ విజిలెన్స్ ఏఈఈ వీరమాచినేని సుధాకర్ ఆస్తులపైనా దాడులు చేశారు. విశాఖతోపాటు విజయవాడలోనూ 2 ఫ్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. విజయనగరం, విజయవాడలో 4 ఖాళీ స్థలాలు, 10 ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో నిర్ధారించారు.

Advertisement

Next Story