Gudur: ఇసుక క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి

by srinivas |
Gudur: ఇసుక క్వారీలో చిక్కుకుని వ్యక్తి మృతి
X

దిశ, గూడూరు: తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం మెట్టు గ్రామ సమీపంలోని స్వర్ణముఖి నదిలో జరుగుతున్న ఇసుక రీచ్‌లో ఇరుక్కున్న ఓ వ్యక్తి మృతి చెందారు. మృతుడు కోట మండలం ఊనుగుంట పాలెం పంచాయితీలోని రుద్రవరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ముత్యాలయ్యగా గుర్తించి గ్రామస్తులకు సమాచారం అందించారు. ఇసుక రీచ్‌ని దాటుకుని మెట్టు గ్రామాని వెళ్లిన ముత్యాలయ్య తిరిగి స్వగ్రామానికి వెళ్లే క్రమంలో ఇసుక క్వారీ గుంతలో ఇరుక్కుని మృతి చెందాడు. ప్రమాదంగా మారిన రీచ్‌ను రద్దు చేయాలని పలు మార్లు గ్రామస్థులు ఆందోళనలు చేశారు. అధికారులు పట్టించుకుని ఉంటే క్వారీ కారణంగా ఓ నిండు ప్రాణం బలి అయ్యేదికాదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story