- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో లెవెల్‌కు చేరుతున్న చిత్తూరు రాజకీయం
దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలో వైసీపీ ఆందోళనలు తీవ్రతరం చేసింది. జిల్లా వ్యాప్తంగా శనివారం ఉదయం నుంచే వైసీపీ శ్రేణులు టీడీపీ, చంద్రబాబు దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తున్నారు. నిన్నటి దాడులకు నిరసనగా ఇప్పటికే జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణలు బంద్ చేశారు. మరోవైపు పూతలపట్టులో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ ఏర్పాటు చేసిన ప్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించివేశారు. రోడ్డుపై ఇరు వర్గాల నేతలు, కార్యకర్తలు బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
ఒకవైపు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్ఎస్ బాబు, కార్యకర్తలు.. మరోవైపు టీడీపీ నేతలు ఆందోళనలు ఉధృతం చేశారు. ఇప్పటికే ముందస్తుగా పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు.. పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై మాట్లాడేందుకు చంద్రబాబు కాసేపట్లో మీడియా ముందుకు రాబోతున్నట్లు సమాచారం. కాగా, చంద్రబాబు పర్యటన నేపథ్యంలో పుంగనూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు కార్యకర్తలపై రబ్బర్ బుల్లెట్లు, బాష్పవాయువులను ప్రయోగించారు. టీడీపీ కార్యకర్తలకు గాయాలవడంతో టీడీపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగారు. పరిస్థితిని అదుపుచేయడానికి పోలీసుల నానా అవస్థలు పడ్డారు.