- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సిక్కులకు గుడ్ న్యూస్ తెలిపిన సీఎం జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్రంలోని సిక్కులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శుభవార్త తెలిపారు. సిక్కు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అంతేకాదు గురుద్వారాల్లో పూజారులైన గ్రంధీలకు పార్టర్లు, మౌలాలీల మాదిరిగానే ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామన్నారు. గురునానక్ జయంతి రోజైన కార్తీక పౌర్ణమి రోజున సెలవు ఇవ్వడానికి కూడా సీఎం జగన్ అంగీకరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను సిక్కు మత పెద్దలు సోమవారం కలిశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్బంగా పలు అంశాలపై విజ్ఞప్తులు చేశారు. సిక్కు మైనార్టీ విద్యాసంస్థ ఏర్పాటుకు సాయం అందిస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. అలాగే గురుద్వారాలకు ఆస్తి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. సిక్కులు పారిశ్రామికంగా ఎదిగేందుకు సహాయ సహకారాలు అందించాలని ఉన్నతాధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.