- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రాష్ట్రంలోకి కొత్త టీమ్ ఎంట్రీ.. ఏకంగా సీఎం కార్యాలయం నుంచే వర్క్
దిశ, ఏపీ బ్యూరో: ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి అనుబంధంగా యువరక్తంతో కొత్త బృందం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. వీరికి 'చీఫ్ మినిస్టర్ ఫెలోస్' అని పేరు పెట్టి పాలనలో సమస్యలు, పథకాల అమలులో లోటుపాట్లు, వాటికి పరిష్కారాలపై అధ్యయనం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో నేరుగా ముఖ్యమంత్రికి నివేదించడం ఈ బృందం ప్రధాన విధిగా ఆలోచిస్తున్నట్లు సమాచారం. టీమ్ తనకు పాలనలో సహాయకారిగా ఉండాలని సీఎం భావిస్తున్నారు. కొన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులు ఇప్పటికే ఇటువంటి బృందాలను ఏర్పాటు చేసుకొన్నారు. గుజరాత్ సీఎంఓ కోసం ఐఐఎం అహ్మదాబాద్ తొలుత ఇటువంటి బృందాన్ని ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా ఈ బృందాల పనితీరును పరిశీలించి రాష్ట్రంలో మరింత మెరుగ్గా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆశిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. 'చీఫ్ మినిస్టర్ ఫెలోస్' పేరుతో మొత్తం 25 మందిని నియమించనున్నారని, దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన ప్రతిభావంతులను ఈ టీమ్ కోసం ఎంపిక చేస్తారని తెలుస్తోంది. వీరికి ఆకర్షణీయమైన జీతభత్యాలు ఇవ్వనున్నారు. శిక్షణ అనంతరం ఒక్కొక్కరికి ఒక్కో జిల్లా బాధ్యతలు కేటాయిస్తారు. వచ్చే ఏప్రిల్ నుంచి వీరు రంగంలోకి దిగే అవకాశం ఉందని, సీఎం కార్యాలయం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ బృందం ఉపకరిస్తుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
ప్రభుత్వానికి సహాయకారిగా రాబిన్ శర్మ బృందం
గత ఎన్నికల్లో టీడీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన రాబిన్ శర్మ టీమ్ సేవలను ఇకముందు కూడా వినియోగించుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకొని సూచనలు, సలహాలు ఇవ్వడానికి కొత్తగా ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఇటీవల సీఎం ఆయనకు సూచించినట్లు సమాచారం. రాబిన్ టీమ్‌లో కీలక సభ్యుడు శంతన్ స్థానంలో నియమితుడైన అనంత్ తివారీ నేతృత్వంలో ఈ కొత్త బృందం ప్రభుత్వానికి సహాయకారిగా పని చేయనున్నట్లు సమాచారం. దీనిని పార్టీ తరపున ఏర్పాటు చేయనున్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజాభిప్రాయం ఎలా ఉంది?. వివిధ పథకాల విషయంలో ప్రజల్లో సంతృప్త శాతం జిల్లాల్లో టీడీపీ పనితీరును తెలుసుకోవడంతో పాటు ఇతర పార్టీల కార్యకలాపాల సమాచారం సేకరించి అందజేయడం ఈ బృందం విధి. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఎన్నికల వ్యూహకర్తలకు చెందిన సంస్థలతో బృందాలను ఏర్పాటు చేసుకొన్నా వాటివల్ల పెద్దగా ఫలితాలు రాలేదు. వాటి అనుభవాలపై టీడీపీ అధినాయకత్వం అధ్యయనం చేయిస్తోంది. అక్కడ జరిగిన పొరపాట్లు చేయకుండా చూసుకోవాలన్నది దీని వెనుక ఆలోచనగా తెలుస్తోంది.
మంత్రుల వద్ద మరో టీమ్
రాష్ట్ర ప్రభుత్వ ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో ఒక బృందాన్ని మంత్రులందరి వద్ద నియమించనున్నారు. ఎంబీఏ పూర్తిచేసిన తెలుగు యువతను ఎంపిక చేసి ప్రస్తుతం వారికి శిక్షణ ఇప్పిస్తున్నారు. తర్వాత ఒక్కో మంత్రి వద్ద ఒక్కొక్కరు చొప్పున నియమించాలని నిశ్చయించారు. ఆ శాఖ పరిధిలో విజన్-2047 లక్ష్యాలను సాధించడానికి జిల్లా, మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించడం, అవి అమలయ్యేలా చూడటం వీరి విధి. సదరు శాఖ రోజువారీ విధుల్లో జోక్యం చేసుకోకుండా విజన్ లక్ష్యాలను చేరుకోవడంపైనే వీరు దృష్టిపెట్టి పనిచేస్తారని అధికార వర్గాల సమాచారం.