‘ఇచట వాహనం నిలిపితే.. అంతే సంగతి’.. వైరల్ అవుతోన్న ‘No Parking Board’

by Jakkula Mamatha |
‘ఇచట వాహనం నిలిపితే.. అంతే సంగతి’.. వైరల్ అవుతోన్న ‘No Parking Board’
X

దిశ,నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో ఒక మందుల దుకాణం ముందు ఏర్పాటు చేసిన నో పార్కింగ్ బోర్డు వైరల్ గా మారింది. దుకాణాల ముందు వాహనాలు నిలుపరాదు అని దుకాణం యజమానులు నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేయడం పరిపాటే. నో పార్కింగ్ బోర్డు లు రెడ్ కలర్ లో ఆంగ్ల అక్షరం" పి"(P)తో ఉంటాయి. అయితే దీనికి విరుద్ధంగా" చెప్పు"తో ఏర్పాటు చేయడం వైరల్ గా మారింది. వాహనాలు నిలిపితే చెప్పుతో కొడతా అని అర్థం వచ్చేలా బోర్డు ఏర్పాటు చేయడంతో ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసు అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.

Advertisement

Next Story