- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ముగిసిన తెలంగాణ కేబినెట్ సమావేశం.. రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీకి ఆమోదం
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్ మంత్రివర్గ సమావేశం(Cabinet meeting) ముగిసింది. సచివాలయం(Secretariat) వేదికగా మంత్రులు ఇతర శాఖ అధికారులతో సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో.. రైతు భరోసా పథకం(Rythu Bharosa Scheme) పై కేబినెట్ సబ్ కమిటీ(Cabinet Sub Committee) నివేదికను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి అందజేశారు. అనంతరం దీనిపై చర్చించిన మంత్రి వర్గం రైతు భరోసా కు ఆమోదం తెలిపింది. ఈ కేబినెట్ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్లు, బీసీ రిజర్వేషన్, రేషన్ కార్డుల జారీ, సన్నబియ్యం పంపిణీ, మండలాల ఏర్పాటుపై సూదీర్ఘంగా చర్చించారు. మొత్తం 22 అంశాలపై చర్చించగా సంక్రాంతి పండుగ(Sankranti festival) నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ కింద సన్న బియ్యం పంపిణీకి కేబినెట్ ఆమోదం(Cabinet approval) తెలిపింది. అలాగే తెలంగాణ టూరిజం పాలసీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశమంపై వివరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మరికొద్ది సేపట్లో మీడియా ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ మీడియా సమావేశం(Media conference)లో రైతు భరోసాపై సీఎం కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం అందుతుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.