Nikhil Siddharth: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన హీరో నిఖిల్.. (పోస్ట్)

by sudharani |
Nikhil Siddharth: తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ను కలిసిన హీరో నిఖిల్.. (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ (Nikhil Siddharth) ‘కార్తికేయ’ చిత్రంతో పాన్ ఇండియా లెవల్‌లో గుర్తింపు తెచ్చుకున్నాడు.తర్వాత దానికి సీక్వెల్‌గా తెరకెక్కిన ‘కార్తికేయ-2’తో మరింత ప్రేక్షకుల్లో మరింత క్రేజ్ తెచ్చుకున్న ఈ కుర్ర హీరో.. ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవల ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పుడు ‘స్వయంభూ’ (Swayambhu) చిత్రంలో నటిస్తున్నాడు. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో సంయుక్తా మీనన్ (Samyukta Menon), నభా నటేష్ (Nabha Natesh) హీరోయిన్లుగా నటిస్తున్నారు. రెండు పార్టులుగా రాబోతున్న ఈ చిత్రం ప్రజెంట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

ఇదిలా ఉంటే.. ఈ యంగ్ హీరో తాజాగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ (State Governor)ను కలిశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ.. ‘తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గౌరవనీయులైన జిష్ణు దేవ్ వర్మ (Jishnu Dev Varma) జీతో సమావేశం ఎంతో అద్భుతంగా అనిపించింది. సినిమా నుంచి జాతీయ ఐక్యత వరకు వాటికి సంబంధించిన వివరాల గురించి మాట్లాడారు. దీన్ని సాకారం చేసినందుకు అమరవాణి ఫౌండేషన్, మదన్ గోసావి జీ, సాకేత్ జీ అండ్ కృష్ణ చైతన్యలకు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశాడు నిఖిల్. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story