- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News: ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. వారికి మరో ఛాన్స్!
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో ఓటర్ల జాబితాపై ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా కీలక ప్రకటన చేశారు. ఈనెల 25 నుంచి ఓటర్ల జాబితాలో పేరు సవరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 17న ఓటర్ల జాబితా ముసాయిదా ప్రకటించనున్నట్లు వెల్లడించారు. అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు స్వీకరిస్తారన్నారు. జాబితాలో తప్పులుంటే ఇంటింటి తనిఖీల్లో సరిచేస్తామని అన్నారు. 2024 ఫిబ్రవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు.
కాగా రాష్ట్రంలో పది లక్షల ఓట్లను తొలగించినట్లు గత ప్రకటనలో ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే ఆ ఓట్ల తొలగింపుపై ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయలేదని... వాటిని ఫేక్ ఓట్లుగా పరిగణిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితాలో సవరణ చేయడానికి ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.