- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ap News:‘చంద్రబాబు మాటలకు, చేతలకు పొంతన ఉండదు’.. మాజీ మంత్రి సెన్సేషనల్ కామెంట్స్!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం పై తాజాగా వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ మరోసారి విమర్శలు చేశారు. వివరాల్లోకి వెళితే.. సీఎం చంద్రబాబు ఎన్నికల సమయంలో ప్రకటించిన సూపర్ సిక్స్‌లో ఒక్కటి కూడా అమలు కాలేదు అని కాకాణి అన్నారు. రాష్ట్రంలో ఇటీవల ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీపై మాజీ మంత్రి కాకాణి సంచలన వ్యాఖ్యలు చేశారు. మద్యం, ఇసుకలో కూటమి నేతలు భారీ అవినీతికి పాల్పడుతున్నారని కాకాణి ఫైరయ్యారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు చెప్పే దానికి, చేసే దానికి పొంతన ఉండదని మాజీ మంత్రి కాకాణి ఎద్దెవా చేశారు. పార్టీ నేతలకు ఆయన ఒకటి చెబుతారని.. కానీ క్షేత్ర స్థాయిలో మరొకటి జరుగుతుందని అన్నారు. ఇసుక, మద్యం జోలికి వెళ్లవద్దని పార్టీ సమావేశంలో చంద్రబాబు చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరులుగా మార్చుకుంటున్నారని పేర్కొన్నారు.