- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మీరు, మీరు కొట్టుకుంటే.. కారణం నేనా.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: మీరు మీ చెల్లెలు కొట్టుకుంటే దానికి కారణం నేనా అని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఇవ్వాళ ఉరవకొండలో జరిగిన రా.. కదలిరా సభలో చంద్రబాబు మాట్లాడుతూ సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జగన్ చేసింది తప్పని ఎవరైనా అంటే.. వారికి నా స్టార్ క్యాంపెయినర్ పదవి ఇచ్చేస్తున్నారని, అలా అయితే జగన్ వల్ల నష్టపోయిన వారందరూ నా స్టార్ క్యాంపెయినర్లే అవుతారని అన్నారు. ఒక ఉద్యోగం రాని యువత, జగన్ వల్ల నష్టపోయిన రైతు, ఇలా అందరూ నా స్టార్ క్యాంపెయినర్లే అని అన్నారు.
జగన్ ఆయన చెల్లెలు కొట్టుకొని విడిపోతే, ఆమెకు కాంగ్రెస్ పార్టీ పదవి ఇస్తే దానికి కారణం నేనని ఆరోపిస్తున్నారని, షర్మిలకు స్క్రిప్ట్ నేను ఇస్తున్నానని వైసీపీ నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఎప్పుడైతే టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్నాయో వీళ్ల పతనం ప్రారంభమైందని, అక్కడ్నించి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని అన్నారు. డ్వాక్రా సంఘాలు నేనే పెట్టానని, ఇంట్లో ఉండే మహిళలను బయటకి తీసుకొచ్చి మంచి భవిష్యత్తు ఇచ్చానని గుర్తుచేశారు. మళ్లీ మహిళలని అన్ని విధాల పైకి తీసుకొచ్చే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. అందుకే మహశక్తి అనే పథకం తీసుకొచ్చానని.. ఆడబిడ్డ నిధి ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడబిడ్డలకు రూ.1500 ఇస్తానని ఈ సందర్భంగా ప్రకటించారు.