- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
త్వరలోనే బయటికొస్తా.. జైలు నుండి తెలుగు ప్రజలకు చంద్రబాబు బహిరంగ లేఖ
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి జ్యడిషియల్ రిమాండ్‌లో భాగంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న బాబు.. ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ‘‘నేను ప్రజల హృదయాల్లో ఉన్నా. నన్ను ప్రజల నుండి ఒక్క క్షణం కూడా దూరం చేయలేరు. 45 ఏళ్లుగా నేను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరపలేరు. ఆలస్యమైనా న్యాయమే గెలుస్తుంది. నేను త్వరలోనే బయటకు వస్తాను.. ప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తా. ఓటమి భయంతోనే జైలు గోడల మధ్య బంధించి.. ప్రజలకు నన్ను దూరం చేశామనుకుంటున్నారు.
ఈ చీకట్లు తాత్కాలికమే.. త్వరలోనే కారుమబ్బులు వీడతాయి. దసరాకు రాజమండ్రిలో మేనిఫెస్టో విడుదల చేస్తానని చెప్పా.. కానీ ఇదే రాజమండ్రి జైలులో నన్ను ఖైదు చేశారు. త్వరలోనే బయటకు వచ్చి పూర్తిస్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తా. ఎన్నడూ జనాల్లోకి రాని ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిని.. ప్రజల్లోకి వెళ్లాలని కోరా.. ఆమె అంగీకరించారు. ‘నిజం గెలవాలి’ అంటూ భువనేశ్వరి మీ ముందుకు వస్తున్నారు. నేను బయటకు వచ్చేంత వరకు శాంతియుత పోరాటం కొనసాగించాలి’’ అంటూ బాబు జైలు నుండి ఎమోషనల్ లేఖ రాశారు.