- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వైసీపీ ఎమ్మెల్యేలపై చంద్రబాబు ఘాటు విమర్శలు.. ఆ ఎమ్మెల్యేపై తప్ప..
దిశ వెబ్ డిస్క్: టీడీపీ తిరువూరులో బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగించిన తీరు అందరిలో ఆసక్తిని.. అనుమానాలను రేకెత్తిస్తోంది. ఎన్టీఆర్ జిల్లా లోని వైసీపీ ఎమ్మెల్యేలపై పేరుపేరునా విమర్శల జల్లు కురిపించారు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. కానీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పై మాత్రం ఎలాంటి విమర్శలు చెయ్యలేదు. ఏ ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని వదలకుండ విమర్శించిన ఆయన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ను మాత్రం ఎందుకు స్కిప్ చేశారు..? అనే ప్రశ్న అందరిలోనూ మెదులుతోంది.
అసలే వైసీపీలో మార్పులు చేర్పుల కార్యక్రమం జరుగుతున్న విషయం అందరికి తెలిసిందే. తాజాగా మీడియాతో మాట్లాడిన అచ్చన్నాయుడు కూడా వైసీపీ లోని హేమాహేమీలు కూడా పార్టీని వీడనున్నారని. వాళ్లంతా టీడీపీని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. టీడీపీ కూడా వాళ్ళను ఆహ్వానించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వసంత కృష్ణప్రసాద్ ను ఒక్క మాట కూడా అనలేదు. దీనితో వసంత కృష్ణప్రసాద్ పార్టీ మారనున్నారా..? టీడీపీ అతన్ని ఆహ్వానించిందా? అనే సందేహాలు అందరిలో కలుగుతున్నాయి.