ఎక్కడికి రావాలో చెప్పు వస్తా..చంద్రబాబుకు కేశినేని నాని సవాల్

by Indraja |
ఎక్కడికి రావాలో చెప్పు వస్తా..చంద్రబాబుకు కేశినేని నాని సవాల్
X

దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. దేనికైనా సై అంటే సై అని ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. నిన్న అనంతపురం లో జరిగిన సిద్ధం సభ పై తెలుగుదేశం అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ (X) వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ధైర్యం ఉంటె తనతో భహిరంగ చర్చకు రావాలని.. ప్లేస్, టైం నువ్వే చెప్పు అని జగన్ కి సవాల్ విసిరారు.

అయితే జగన్ కు చంద్రబాబు విసిరిన సవాల్ పై కేశినేని నాని స్పందించారు. ఈ మాత్రం దానికి జగన్ ఎందుకు నేను చాలు.. ఎక్కడికి రావాలో చెప్పు వస్తాను అని పేర్కొన్నారు. నీ గ్రాఫిక్స్ సమాధి వద్దకు రమ్మంటావా..?నీ సొంత రాష్ట్రం తెలంగాణాకు రమంటావా..? లేకుంటే ఎక్కడో చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెకు రమ్మంటావా..? అని ఎద్దేవా చేశారు.

2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో నువ్వు చేసిన అభివృద్ధి గురించి.. అలానే 2019 నుండి 2024 వరకు జగన్ చేసిన అభివృద్ధి గురించి చర్చించడానికి తాను సిద్ధం అని చంద్రబాబు సవాల్ ను స్వీకరించారు. ఇక ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న నువ్వు విజయవాడకు వంద కోట్లు ఎప్పుడన్నా ఇచ్ఛావ..? చంద్రబాబు అని ప్రశ్నించారు.


Advertisement

Next Story