చంద్రబాబు అరెస్ట్ : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఏమన్నారంటే?

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-09 09:24:05.0  )
చంద్రబాబు అరెస్ట్ : బీజేపీ స్టేట్ చీఫ్ పురంధరేశ్వరి ఏమన్నారంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అరెస్ట్ పై ఏపీ బీజేపీ స్టేట్ చీఫ్ దగ్గుపాటి పురంధరేశ్వరి ట్విట్వర్ వేదికగా స్పందించారు. ‘ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సరైన నోటీసు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ లో పేరు పెట్టకుండా, ఎక్స్ ప్లనేషన్ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం సమర్థనీయం కాదు. బీజేపీ దీనికి ఖండిస్తుంది.’ అని తెలిపారు.

Advertisement

Next Story