చంద్రబాబు భార్య భువనేశ్వరి సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు ముహూర్తం ఖరారు

by Javid Pasha |
చంద్రబాబు భార్య భువనేశ్వరి సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా యాత్రకు ముహూర్తం ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో ఆయన భార్య నారా భువనేశ్వరి ప్రజాక్షేత్రంలోకి దిగారు. అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ చేపడుతున్న ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజమండ్రిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడంతో పాటు గాంధీ జయంతి రోజున ఒకరోజు పాటు నిరాహార దీక్ష కూడా చేపట్టారు. జగన్ ప్రభుత్వంపై విమర్శల చేస్తోన్న ఆమె.. ప్రజల కోసం పోరాడుతున్నందుకే తన భర్తను అరెస్ట్ చేశారనే విషయాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

కోర్టుల్లో పిటిషన్లపై తీర్పు రావడం ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో భువనేశ్వరి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిజం గెలవాలి పేరుతో యాత్ర చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ఈ నెల 25వ తేదీ నుంచి భువనేశ్వరి యాత్ర ప్రారంభం కానుందని శనివారం నారా లోకేష్ వెల్లడించారు. యాత్రలో భాగంగా చంద్రబాబు అరెస్టయ్యాక ఆవేదనతో మరణించినవారి కుటుంబాలను పరామర్శించనున్నారని తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గం నుంచి 25న యాత్ర మొదలవుతుందని, 24న తిరుమల శ్రీవారిని దర్శించుకుంటారని చెప్పారు.

తిరుమల నుంచి 24న నారావారిపల్లెకు భువనేశ్వరి వెళ్తారని లోకేష్ తెలిపారు. అటు భువనేశ్వరి మాట్లాడుతూ.. పుంగనూరు ఘటన పెత్తందారీ పోకడలకు నిదర్శనమని, రాష్ట్రంలో రౌడీ రాజకీయానికి ఈ దాడి నిదర్శనమని ఆరోపించారు. బీహార్‌లో కూడా ఇంత అరాచక పరిస్థితులు లేవని, పేదలపై పెత్తందారీ పోకడలు అంటే ఇవేనని విమర్శించారు.

Advertisement

Next Story

Most Viewed