రేపు ఢిల్లీకి చంద్రబాబు.. 2014 పొత్తుల సీన్ రిపీట్?

by Prasad Jukanti |   ( Updated:2024-02-06 14:17:58.0  )
రేపు ఢిల్లీకి చంద్రబాబు.. 2014 పొత్తుల సీన్ రిపీట్?
X

దిశ, డైనమిక్ బ్యూరో:ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుల వ్యవహారం ఉత్కంఠ రేపుతున్నది. జగన్ సర్కార్ ను గద్దె దింపేందుకు కలిసి పోటీ చేస్తామని టీడీపీ, జనసేన ఇప్పటికే ప్రకటించాయి. ఇరు పార్టీల మధ్య ఇదివరకే సీట్ల పంపకాలపై చర్చలు కూడా జరిగాయి. ఇక పొత్తుల అంశంలో బీజేపీ నిర్ణయంపై ఉత్కంఠ కొనసాగుతున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ టూర్ ఆసక్తిగా మారింది. రేపు సాయంత్రం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బీజేపీ పెద్దలతో చంద్రబాబు భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ టూర్ తో బీజేపీ పెద్దలు అమిత్ షాతో బాబు చర్చలు జరపనున్నట్లు సమాచారం. ఈ టూర్ తో ఏపీలో టీడీపీ, జనసేన కూటమితో బీజేపీ కలిసి వెళ్తుందా లేక ఒంటరిగానే పోటీ చేస్తుందా అనేదానిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది.

బాబు వెంటే పవన్?:
ఢిల్లీ టూర్ లో చంద్రబాబు వెంట పవన్ కల్యాణ్ సైతం వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఒక వేళ రేపు పవన్ కల్యాణ్ తో పాటు వెల్లని పక్షంలో తర్వాత ఆయన ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ కనిపిస్తోంది. 8న చంద్రబాబు, పవన్ కల్యాణ్ భేటీ కావాలని ఇప్పటికే నిర్ణయించుకున్న నేపథ్యంలో వీరు ఢిల్లీలోనే సమావేశం అవుతారా లేక రాష్ట్రంలోనే భేటీ అయి పోటీ చేయబోయే స్థానాలపై డిసిషన్ తీసుకుంటారా అనేది తేలాల్సి ఉంది. అయితే చంద్రబాబు బీజేపీ పెద్దలతో కలిసి పొత్తు, సీట్ల పంపకాలపై చర్చించి ఫైనల్ డిసిషన్ తీసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అభ్యర్థుల ప్రకటన విషయంలో ఆలస్యం చేయడం వల్ల ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉండటంతో వీలైనంత త్వరగా ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే సీట్ల పంపకాలపై ఓ స్పష్టంత కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

2014 పొత్తుల సీన్ రిపీట్ ?:

కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఇన్నాళ్లు దూరమైన మిత్ర పార్టీలను తిరిగి ఎన్డీయే కూటమిలోకి ఆహ్వానించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఏపీలోనూ జనసేన బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతుండగా టీడీపీని సైతం దగ్గరకు చేర్చుకుని తిరిగి ఎన్డీయే కూటమిలో కి ఆహ్వానించే విషయంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూడు పార్టీల మధ్య పొత్తు ఖాయం అయితే ఏపీలో 2014 పొత్తుల సీన్ రిపీట్ కానుంది.

Read More..

హైదరాబాద్‌ను కోల్పోవడం వల్లే విశాఖ పై ఫోకస్ చేస్తున్నాం: సీఎం జగన్..

Advertisement

Next Story