- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP Political News: టెర్రరిస్ట్ కాళ్ళు పట్టుకున్న ఏపీ మాజీ సీఎం చంద్రబాబు
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు వేడెక్కాయి. అధికార పార్టీ నేతలకు విపక్షాల నేతలు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటోంది. ప్రత్యర్ధులు చేసే ప్రతి పనిలో ఎదోఒక వంకపెట్టి విమర్శలు గుప్పించడం ఏపీ రాజకీయనాయకులకు అలవాటుగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీతో టీడీపీ పొత్తు ఖరారైన విషయం అందరికి తెలిసిందే.
బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోవడంపై వైసీపీ మంత్రి అంబటి రాంబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గతంలో టీడీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రధాని మోడీని టెర్రరిస్ట్ అని దుయ్యబట్టారు.
కానీ అప్పుడు ఎవరినైతే టెర్రరిస్ట్ అని అన్నారో ఆ టెర్రరిస్ట్ కాళ్ళనే నేడు చంద్రబాబు పట్టుకుంటున్నాడని అంబటి పేర్కొన్నారు. అందితే జుట్టు అందకపోతే కాళ్ళు ఇదీ బాబు గారి నైజం అర్దమయ్యిందా..? అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
అప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు !
— Ambati Rambabu (@AmbatiRambabu) March 16, 2024
ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నాడు !
అందితే జుట్టు
అందకపోతే కాళ్ళు
ఇదీ బాబు గారి నైజం!
అర్దమయ్యిందా !@ncbn @PawanKalyan @narendramodi @BJP4India @AmitShah