మంత్రి సీతక్కకు కాంట్రాక్టు టీచర్ల కృతజ్ఞతలు

by Gantepaka Srikanth |
మంత్రి సీతక్కకు కాంట్రాక్టు టీచర్ల కృతజ్ఞతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: గిరిజన సంక్షేమశాఖ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న మూడు వేల మంది కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లను రాష్ట్ర ప్రభుత్వం రెన్యువల్ చేసింది. తమ సేవలను రెన్యువల్ చేయించడంలో ప్రత్యేక చొరవ చూపిన మంత్రి సీతక్కకు కాంట్రాక్టు రెసిడెన్షియల్ టీచర్లు థాంక్స్ చెప్పారు. మంగళవారం ప్రజాభవనలో ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న రెన్యూవల్ ఫైల్‌పై సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల సంతకం పెట్టారు. పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. త్వరలో ఉన్నతాధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story