సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

by Seetharam |   ( Updated:2023-09-06 12:31:48.0  )
సీఎం వైఎస్ జగన్‌కు చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం కౌకుంట్లలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతుంది. కౌకుంట్లలో పర్యటనలో భాగంగా సిఎం జగన్‌కు చంద్రబాబు నాయుడు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. కౌకుంట్ల గ్రామ పరిధిలో హంద్రీ కాలువ, పవన విద్యుత్ ప్రాజెక్ట్, డ్రిప్ ఇరిగేషన్ పై సెల్ఫీలు దిగి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. హంద్రీనీవా కాలువల పనుల్లో ఎవరి హయాంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పగలరా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ హయాంలో గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా వచ్చిన విండ్ ఎనర్జీ టవర్స్‌ను చూపిస్తూ చంద్రబాబు సెల్ఫీ దిగారు. విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీల ద్వారా ఎవరి హయాంలో ఎంత ఉత్పత్తి జరిగిందో చెప్పగలరా అంటూ జగన్‌కు సవాల్ విసిరారు. నాడు డ్రిప్ ఇరిగేషన్‌కు ఇచ్చిన సబ్సిడీ లను ప్రస్తావిస్తూ.... అనంతపురంలో మొదలు పెట్టిన సామాజిక డ్రిప్ ప్రాజెక్టు ఏమైంది అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఇదీ ప్రజలకు మేలు చేసే విధానం అంటూ చంద్రబాబు నాయుడు తెలిపారు.

Advertisement

Next Story