తగ్గేదేలే.. ఖజానాకు కిక్కే కిక్కు..

by Sumithra |   ( Updated:2025-01-02 05:56:51.0  )
తగ్గేదేలే.. ఖజానాకు కిక్కే కిక్కు..
X

దిశ బ్యూరో, కరీంనగర్ : నూతన సంవత్సర వేడుకలు అంటేనే విందు, వినోదానికి పెట్టింది పేరు. ఇప్పటికే పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో మద్యం విక్రయాల్లో రికార్డులు సృష్టించిన మద్యం ప్రియులు.. తాజాగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో మైలురాయి చేరుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా మద్యం విక్రయాలు సరికొత్త రికార్డు లిఖించాయి. డిసెంబర్ 31కి ముందుగా వారం రోజుల్లో కోట్ల విలువైన సరుకు అమ్ముడుపోయింది. కొత్త సంవత్సరం వేడుకలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు కిక్కెక్కించింది. ఒక్క రోజులోనే మద్యం ప్రియులు రూ. 100 కోట్లకు పైగా మద్యం తాగి మత్తు జోష్ లో తేలారు. కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగి ప్రభుత్వ ఖజానాను నింపేశాయి.

డిసెంబర్ 31.. ఒక్కరోజులోనే 100 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగి సరికొత్త రికార్డు సృష్టించగా.. గత సంవత్సరంతో పోల్చితే ఈ అమ్మకాలు మూడింతలు పెరిగి రూ.100కోట్ల విలువైన మద్యం విక్రయాలు నమోదు చేశారు. ఇదంతా కేవలం ఒక్క రోజుల్లోనే కావడం గమనార్హం. కరీంనగర్ జిల్లాలో సుమారుగా 30 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరుగగా జగిత్యాలలో రూ.24 కోట్లకు పైబడి అమ్మకాలు జరిగాయి. రాజన్న సిరిసిల్లా రూ.21 కోట్లకు పైగా అమ్మకాలు జరగగా పెద్దపల్లి జిల్లాలో 33 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగి రికార్డు సృష్టించింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా రూ.75 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది.

Advertisement

Next Story

Most Viewed