యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి: గవర్నర్

by Mahesh |
యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలి: గవర్నర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: యువత సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని రాష్ర్ట గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అభిప్రాయపడ్డారు. శనివారం రాజ్ భవన్ లో జరిగిన సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్స్ యూత్(స్పీక్ మకే) 10వ అడ్వైజరీ బోర్డ్ సమావేశం గవర్నర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి కళలు, సంస్కృతి, విద్య, పరిపాలన రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఇండియా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం మనందరి బాధ్యత అన్నారు. శాస్త్రీయ కళల వారసత్వం భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరు క్రుషి చేయాలన్నారు. యువతలో కళల పట్ల ఆసక్తిని పెంచేందుకు స్పీక్ మకే నిర్వహించే కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. స్పీక్ మకే కార్యకలాపాల పరిధిని ప్రపంచ దేశాలకు విస్తరించేలా చేయాలని గవర్నర్ ఆకాంక్షించారు.

ఇలాంటి వేదికలు భారతీయ సాంస్కృతిక సాంప్రదాయాల పట్ల మక్కువ పెంచుతాయన్నారు. అనంతరం స్పిక్ మకే వ్యవస్థాపకుడు కిరణ్ సేథ్ మాట్లాడుతూ ఐన్‌స్టీన్, మాక్స్ ప్లాంక్, సివి రామన్ లాంటి శాస్త్రవేత్తలు శాస్త్రీయ సంగీతంతో బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకుని విజయాలు సాధించారన్నారు. సొసైటీ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అండ్ కల్చర్ అమాంగ్ యూత్ (స్పీక్ మకే) అనేది రాజకీయేతర, మత రహిత, స్వచ్ఛంద సంస్థ. ఇది యువతను కళల ద్వారా ఎడ్యుకేట్ చేస్తుంది. శాస్త్రీయ సంగీతం, నృత్యం, జానపద కళలు, భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై యువత మక్కువ పెంచుకునేలా ప్రేరేపిస్తుంది. యువతలో భారతదేశ సాంస్కృతిక వారసత్వం గురించి అవగాహన కల్పించడానికి, నికి ఈవెంట్‌లు, కచేరీలు, పండుగలు, విద్యా కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed