- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
‘గేమ్ ఛేంజర్’ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్న స్టార్ డైరెక్టర్.. నెట్టింట ఆకట్టుకుంటున్న పోస్ట్
దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, యంగ్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న తాజా మూవీ ‘గేమ్ ఛేంజర్’. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇక ఇందులో అంజలి, సముద్రఖని, ఎస్ జె సూర్య, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక గేమ్ ఛేంజర్ సినిమా భారీ అంచనాల మధ్య జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ కానుంది.
ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. గేమ్ ఛేంజర్ ట్రైలర్ ఈరోజు అనగా జనవరి 2 సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు రానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఈవెంట్‌కు చరణ్, శంకర్, దిల్ రాజు, SJ సూర్యతో పాటు పలువురు మూవీ టీమ్ హాజరుకానున్నారు. అలాగే గేమ్ ఛేంజర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా రానున్నట్టు మూవీ యూనిట్ ప్రకటించారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. రాజమౌళి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ కానున్నట్లు తెలియజేశారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఈ ట్రైలర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read More ....
‘గేమ్ ఛేంజర్’ సినిమాకు అక్కడ గట్టిపోటీ..? నెట్టింట వైరల్ అవుతున్న న్యూస్