- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు.. అధికారులకు అందిన సమాచారం
దిశ, వెబ్ డెస్క్: ప్రధాని మోడీ(Prime Minister Modi) ఏపీ పర్యటన(AP Tour) ఖరారు అయింది. ఈ నెల 8న మధ్యాహ్నం ఆయన విశాఖ(Visakha)కు రానున్నారు. అనంతరం నేరుగా ఆంధ్రా యూనివర్సిటీ(Andhra University) (ఏయూ) ఇంజినీరింగ్‌కళాశాలకు వెళ్లనున్నారు. ఎన్టీపీసీ(Ntpc) ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు(Green Hydrogen Project)తో పాటు రైల్వేజోన్ పరిపాలన భవనాలు(Railway Zone Administration Buildings), ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు(Cm Chandrababu Naidu)తో పాటు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్(Deputy Cm Pawan Kalyan), పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొననున్నారు. 8న ఢిల్లీ నుంచి ప్రధాని మోడీ తొలుత విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అనంతరం పర్యటనను కొనసాగిస్తారు. ఈ మేరకు ప్రధాని మోడీ విశాఖ టూర్ షెడ్యూల్ కు సంబంధించి జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. ప్రధాని మోడీ టూర్‌కు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.