విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య

by srinivas |
విశాఖ జిల్లాలో విషాదం.. దంపతుల ఆత్మహత్య
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ జిల్లా(Visakha District)లో విషాదం(Tragedy) చోటు చేసుకుంది. దంపతులు(Couples) బలవన్మరానికి పాల్పడ్డారు. పెందుర్తి మండలం పురుషోత్తం గ్రామానికి(Purushottam village) చెందిన భార్యభర్త కొంతకాలంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఇటీవలకాలంలో ఆర్థిక ఇబ్బందులు మరీ ఎక్కువ కావడంతో రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నారు. ఉదయం తలుపులు తీయకపోవడంతో స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతులు సంతోష్, సంతోష్ శ్రీగా గుర్తించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed