- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AP News:పేదలకు చంద్రబాబు సర్కార్ గుడ్ న్యూస్..ఇళ్ల నిర్మాణంపై కీలక నిర్ణయం..!
దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ సర్కార్ తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుంది. సోమవారం గృహనిర్మాణ శాఖపై జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో మధ్య, దిగువ మధ్య తరగతి వారికి ఇళ్ల కోసం గృహ నిర్మాణ శాఖ ద్వారా ప్రత్యేకంగా ఒక పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అర్హులను గుర్తించి, కేంద్రం అమలు చేస్తున్న పథకాలతో నాణ్యమైన ఇళ్ల నిర్మాణం చేపట్టాలని మంత్రులకు సూచించారు.
వైసీపీ హయాంలో ఇళ్లు మంజూరై కోర్టు వివాదాల కారణంగా నిర్మించుకోని వారికి కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ)-2.0 కింద అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమావేశంలో మంత్రి పార్థసారథి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల భూమిని కేటాయిస్తామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూములు సేకరించి లేఅవుట్‌లు వేయని ప్రాంతాల్లో కూడా పేదలకు ఇళ్లు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారని మంత్రి ప్రస్తావించారు. జర్నలిస్టులకు కూడా ఇళ్ల నిర్మాణం చేపట్టి తక్కువ ధరలకు ఇళ్లు కట్టిస్తామని తెలిపారు.