Chandrababu Naidu : ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఏ25గా చంద్రబాబు పేరు

by Javid Pasha |   ( Updated:2023-09-30 12:26:01.0  )
Chandrababu Naidu : ఫైబర్‌నెట్ కేసులో కీలక పరిణామం.. ఏ25గా చంద్రబాబు పేరు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసిన వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఏ25గా సీఐడీ చేరుస్తూ నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో లోకేష్‌కు నోటీసులు జారీ చేసిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇప్పటికే స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉండగా.. ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ కేసుల్లో కూడా ఆయనను సీఐడీ నిందితుడిగా చేర్చింది. దీంతో ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా హైకోర్టును చంద్రబాబు ఆశ్రయించారు. వీటిపై విచారణ అక్టోబర్ 4కు వాయిదా పడింది.

చంద్రబాబుపై వరుస కేసులు నమోదు చేస్తుండటంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఎన్నికలు మరో ఆరు నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులకు నిరసనగా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళనలకు దిగుతున్నారు. ఈ తప్పుడు కేసులు వల్ల చంద్రబాబుకు ఏమీ కాదని, ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని చెబుతున్నారు.

Advertisement

Next Story