- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pablo Escobar : ‘వైఎస్ జగన్ పాబ్లో ఎస్కోబార్ లాంటోడు’ : చంద్రబాబు
దిశ, నేషనల్ బ్యూరో : ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కొలంబియా డ్రగ్ డాన్ పాబ్లో ఎస్కోబార్‌తో సీఎం చంద్రబాబు నాయుడు పోల్చారు. కొందరికి అవసరాలు ఉంటాయని, కొందరికి కోర్కెలు ఉంటాయని, కొందరికి పిచ్చి ఉంటుందని, పిచ్చి పట్టినవాళ్లే ఇలాంటి దందాలు చేస్తుంటారని ఏపీ అసెంబ్లీలో సీఎం వ్యాఖ్యానించారు. ‘‘అత్యంత సంపన్నుడు కావాలనేదే మాజీ సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. టాటా, రిలయన్స్,అంబానీల కన్నా ఎక్కువ సంపన్నుడు కావాలని జగన్ అలా చేశారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.
‘‘పాబ్లో ఎస్కోబార్ కొలంబియా డ్రగ్ లార్డ్. అతడొక నార్కో ఉగ్రవాది. తర్వాతి కాలంలో ఎస్కోబార్ రాజకీయవేత్తగా మారాడు. ఆ తర్వాత కూడా అతడు ఒక సిండికేట్ ముఠాను ఏర్పాటుచేసి డ్రగ్స్ దందాను కొనసాగించాడు’’ అని ఏపీ సీఎం వివరించారు. ‘‘1976లో మొదటిసారి పాబ్లో ఎస్కోబోర్‌ను అరెస్టు చేశారు. 1980 నాటికి అతడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన డ్రగ్ కింగ్‌పిన్‌గా అవతరించాడు’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘‘1980వ దశకంలో డ్రగ్స్ స్మగ్లింగ్ దందా ద్వారా ఎస్కోబార్ రూ.2.50 లక్షల కోట్లు సంపాదించాడు. ఆ సంపద విలువ ఇప్పుడు రూ.7.50 లక్షల కోట్లు ఉంటుంది’’ అని ఆయన తెలిపారు.