ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్

by Kavitha |   ( Updated:2024-08-26 14:50:38.0  )
ప్రజలకు శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు నాయుడు స్పెషల్ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు శ్రీ కృష్ట జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. "శ్రీ కృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా ప్రజలకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమే. ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీ కృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా, కటాక్షం రాష్ట్రంపై సదా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.

(video credits to chandrababu naidu X account)

Advertisement

Next Story