- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: నమ్మించి గొంతుకోసిన వ్యక్తి జగన్..చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు అరకులో టీడీపీ నేతలు రా కదిలిరా భహిరంగ సభను నిర్వహించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నమ్మించి గోతు కోశాడని ఆరోపించారు. గిరిజనుల పొట్టకొట్టే ప్రభత్వం ఏదైనా ఉందంటే అది వైసీపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. ఇక గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలను స్థానిక ప్రజలకే ఇవ్వాలని తాను సంకల్పించుకున్నట్లు తెలిపారు.
ఇక తాను అధికారం లో ఉన్నప్పుడు జారీ చేసిన జీవో నెంబర్ 3ని వైసీపీ అధికారం లోకి వచ్చాక ఎందుకు రద్దు చెయ్యాల్సి వచ్చిందో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ సామజిక న్యాయం చేస్తానని గొప్పలు చెబుతున్నారని.. సామజిక న్యాయం అంటే జీవో నెంబర్ 3ని రద్దు చేయడమేనా..? అని ప్రశించారు. తాను మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 3ని పునరుద్ధరిస్తానని పేర్కొన్నారు. అలానే టీడీపీ 16 పథకాలను గిరిజనుల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిందని.. కానీ ఆ పథకాలను వైసీపీ రద్దు చేసిందని.. అలా ఎందుకు రద్దు చెయ్యాల్సి వచ్చిందో చెప్పాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేసారు.
అసలు గిరిజనుల పిల్లలు చదువుకోడం ఏపీ సీఎంకి ఇష్టం లేదని అందుకే ఎన్టీఆర్ విద్యోన్నతి పథకం రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేసారు. తాము ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చదివిన గిరిజన విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు ఇస్తే .. జగన్ వాటిని రద్దు చేశారని మండిపడ్డారు. ఇక విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ కేంద్రాలు పెడితే వాటినీ ఊడగొట్టారని.. అలానే గిరిపుత్రిక కల్యాణ పథకాన్నీ రద్దు చేశారని ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. గిరిజనులకు 50 ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత టీడీపీదే అని గర్వంగా చెప్పారు. జగన్ గిరిజనుల సహజ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
Read More..
Breaking news: ఎన్నికలకు సంసిద్దమవుతున్న జనసేన.. జోనల్ వారీగా కమిటీలు
Read More..