ఆ విషయంలో జగన్ ఎందుకు స్పందిచడం లేదు.. ప్రశించిన చంద్రబాబు

by Indraja |
ఆ విషయంలో జగన్ ఎందుకు స్పందిచడం లేదు.. ప్రశించిన చంద్రబాబు
X

దిశ డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రవ్యాప్తంగా రా కదలిరా బహిరంగ సభను నిర్వహిస్తున్న విషయం అందరికి సుపరిచితమే. కాగా ఈ రోజు మాడుగుల లో టీడీపీ నేతలు రా కదిలి రా బహింరంగా సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో పాల్గొన్న చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యువత ఎవరి పక్కన ఉంటె వారిదే గెలుపుని తెలిపారు.

జనసేన టీడీపీ కలిసింది, గెలుస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని.. గాడి తప్పిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేస్తామని హామీ ఇచ్చారు. ఇక నిన్న జగన్ మాట్లాడుతూ 124 సార్లు బటన్ నొక్కాను అన్నారని.. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు గురించి ఏంటని చంద్రబాబు ప్రశించారు. అలానే ప్రజలకు పది రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచుకున్న దొంగ సీఎం జగన్మోహన్ రెడ్డి అని ధ్వజమెత్తారు.

ఇక జగన్ బట్టన్ నొక్కడంతోనే 9 సార్లు కరెంట్ చార్జీలు పెరిగాయా..? లేదా అని శ్నించారు. ప్రజల పైన 64 వేళా కోట్ల రూపాయలు భారం వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టీడీపీ హయాంలో ఎప్పుడైనా కరెంట్ చార్జీలు పెంచామా..? అంటూ ప్రజలను ప్రశించారు. ఇక వైసీపీ అధికలారంలోకి వచ్చాక RTC రేట్లు పెరిగాయని, నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆరోపించారు.

అన్నింటికీ బట్టన్ నొక్కే సీఎం జగన్ మద్యపాన నిషేదానికి, సిపిఎస్ రోడ్డుకి ఎందుకు బటన్ నొక్కడం లేదో సమాధానం చెప్పాలని ప్రశించారు. అధికారంలోకి రాకముందు తల నిమురుతూ బుగ్గలు తడిమిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలను నట్టేట ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు పార్టీల కోసం కాదని.. రాష్ట్ర భిష్యత్తుకీ, ప్రజల శ్రేయస్సుకి అని.. ఆ ఎన్నికల్లో అలోచించి నాయకుడిని ఎన్నుకోమని ప్రజలకు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story

Most Viewed