- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కార్యకర్తల కోసం గరిట పట్టి స్వయంగా భోజనం వడ్డించిన చంద్రబాబు
దిశ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆ పార్టీ కార్యకర్తలు, అభిమానుల పట్ల చాలా ప్రేమ ఉంటుంది. కార్యకర్తలను తమ్ముళ్లు అంటూ పలకరిస్తారు. సభల్లో కార్యకర్తల సంక్షేమం గురించే ఎక్కువగా ప్రస్తావిస్తారు. సభలనంతరం భోజన కార్యక్రమాల్లో కార్యకర్తలు కడుపు నిండా తినేలా స్పెషల్ వంటకాలు కూడా ఏర్పాటు చేయిస్తారు. అంతేకాదు కార్యకర్తలకు ఇన్సురెన్స్ లాంటివి కూడా చేయించారు. కార్యకర్తలంటే తనకు ఎంత ఇష్టమనేది చంద్రబాబు మరోసారి రుజువు చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా కనిగిరిలో చంద్రబాబు పర్యటన రెండో రోజూ కూడా కొనసాగుతోంది. శుక్రవారం అక్కడ నుంచి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. అలాగే ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించారు. టీడీపీ కార్యాలయం ఆవరణంలో తన బస్సులోనే రాత్రి బస చేసి శనివారం కూడా కనిగిరిలోనే చంద్రబాబు పర్యటిస్తున్నారు. శనివారం మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలు, అభిమానులను కలిశారు. వారితో సెల్ఫీలు దిగారు. అయితే టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ నేటితో ఏడాది కాలం పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం అన్నా క్యాంటీన్‌ను పరిశీలించారు. అక్కడికి వచ్చిన కార్యకర్తలకు, ప్రజలకు భోజనం వడ్డించారు. దీంతో అధినేతే స్వయంగా తన చేతులతో భోజనం వడ్డించడంతో కార్యకర్తలు, అభిమానులు ఆనందంలో తేలియపోయారు. కడుపు నిండా అన్నం తిని చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని కోరుకున్నారు.
కనిగిరిలో మాజీ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహా రెడ్డి నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ ను సందర్శించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు. అన్న క్యాంటీన్ నిర్వహణపై చంద్రబాబు నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా పలువురికి భోజనం వడ్డించారు.#AnnaCanteen #CBNinKanigiri… pic.twitter.com/HULaOKXQld
— Telugu Desam Party (@JaiTDP) January 6, 2024