Delhi: జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం.. కీలక అంశాలపై చర్చ

by srinivas |   ( Updated:2024-06-07 15:46:28.0  )
Delhi: జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశం.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో కూటమి గెలిచిన విషయం తెలిసిందే. అయితే కూటమి గెలుపుతో టీడీపీ, జనసేనకు కేంద్రంలో ప్రాధాన్యత పెరిగింది. దీంతో రాష్ట్రానికి అవసరమైన నిధులు, విభజన హామీలు నెరవేరే అవకాశం ఉండటంతో ఆ దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రాభివృద్ధికే పని చేస్తామని చెప్పిన ఇద్దరు అధినేతలు ఇప్పటికే ఎన్డీయేలో మిత్రపక్షంగా తొలి అడుగుకు శ్రీకారం చుట్టారు. ఎన్డీయే సమావేశంలో పాల్గొని ఆయా నేతలను కలిశారు. రాష్ట్రావసరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

ఇక రాష్ట్ర నేతలకు కీలక పదవులు ఇవ్వాలని అటు అగ్ర నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో మరిన్ని పదవులు తీసుకోవాలని చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం నిర్వహించారు. కేంద్ర కేబినెట్ కూర్పుపై చర్చిస్తున్నారు. వీలైనన్ని ఎక్కువ పదవులు ఏపీ నేతలకు ఇవ్వాలని జేపీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అలాగే అటు రాష్ట్రంలోనూ బీజేపీ నేతలను తన కేబినెట్ లోకి తీసుకుంటామని జేపీకి చంద్రబాబు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం సానుకూల వాతావరణంలోనే చర్చలు కొనసాగుతాయి. ఈ మీటింగ్ తర్వాత పదవులపై ఓ కొలక్కి వచ్చే అవకాశం ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story