- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
AP News:ఏపీ రైతులకు చంద్రబాబు సర్కార్ భారీ గుడ్ న్యూస్!
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రాభివృద్ధిపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ నెల 22 నుంచి ప్రారంభం అయినా ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనలు చేస్తోంది.
వివరాల్లోకి వెళితే..రాష్ట్రంలోని రైతులకు తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. పాల దిగుబడి పెంచడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు. పాల దిగుబడి పెంచే దిశగా చర్యలు తీసుకునేందుకు ఊరూరా పశుగ్రాస క్షేత్రాలు అన్ని గ్రామాల్లో ప్రారంభించాలని ఆదేశించినట్లు స్పష్టం చేశారు. అయితే గతంలో ఈ పథకాన్ని అమలు చేశామని..కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఆపేసారన్నారు. ఈ పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న, సన్న కారు రైతులు ఉన్న పొలంలో కనీసం 25 గుంటల నుంచి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేలా ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి వివరించారు. ఈ క్రమంలో రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి దాదాపు లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.