Breaking: ఒకేసారి 20 మంది పోలీస్ అధికారుల బదిలీ

by srinivas |   ( Updated:2024-11-08 11:05:08.0  )
Breaking: ఒకేసారి 20 మంది పోలీస్ అధికారుల బదిలీ
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Govt) కీలక నిర్ణయం తీసుకుంది. సవర్థవంతమైన పాలన అందించేందుకు మరో సంచలనం వైపు అడుగులు వేసింది. ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పలు ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేపట్టింది. ఐఏఎస్, ఐపీఎస్‌లతో పాటు పలువురు ఉన్నతాధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా డీఎస్పీలను బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. 20 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ప్రకటన చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

గత ప్రభుత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party)కి పోలీస్ శాఖలోని పలువురు అధికారుల అనుకూలంగా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. అయినా ఇంకా కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ నేతల(YCP leaders)కు సహకరిస్తున్నారని ఇటీవల మరోసారి ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని స్వయంగా అధికార పార్టీ నేతలు కూడా చెప్పారు. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. పలువురు డీఎస్పీలను తాజాగా బదిలీ చేసింది.

Advertisement

Next Story