స్కామ్‌లో రూ.370కోట్లు Chandrababu Naidu కొట్టేశారు: మంత్రి Kakani Govardhan Reddy

by Seetharam |   ( Updated:2023-09-29 14:30:07.0  )
స్కామ్‌లో రూ.370కోట్లు Chandrababu Naidu కొట్టేశారు: మంత్రి Kakani Govardhan Reddy
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్‌ స్కాంలో భారీ కుంభకోణం జరిగిందని రాష్ట్రవ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలను సీఐడీ గుర్తించింది అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయలేదని కానీ ఇక్కడికి వచ్చి టీడీపీ నేతలు తాము స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేశామని నానా హడావిడి చేశారని ఆరోపించారు. చంద్రబాబు కుంభకోణానికి పాల్పడలేదని యూనివర్శిటీలోని కంప్యూటర్లు చూపెడుతున్నారు.తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చిన నిధులతోనే విక్రమ సింహపురి వర్సిటీలో స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్ భవనాన్ని నిర్మించారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోనే స్కిల్ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు.ఈ కేంద్రాన్ని చూపించి టీడీపీ ప్రభుత్వంలో వచ్చిందని అసత్యాలు చెప్తున్నారని దీన్ని ప్రజలు నమ్మవద్దని అన్నారు. నెల్లూరు జిల్లాలో కేవలం రెండు కళాశాలల్లో మాత్రమే స్కిల్ డవలప్ మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అయితే చంద్రబాబు హయాంలో యూనివర్సిటీల్లో ఏర్పాటు చేశామని టీడీపీ నేతలు అబద్ధాలు చెప్పారని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.‘రూ.3 వేల 370 కోట్ల పథకంలో రూ.370 కోట్లను చంద్రబాబు కొట్టేశారని ఆరోపించారు. సీమెన్స్ కంపెనీ పేరుతో డబ్బులు స్వాహా చేశారు అని మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి మండిపడ్డారు.

ఇవి కూడా చదవండి : ఎమ్మెల్యేలు చక్రవర్తుల్లా.. ఎంపీపీలు సామంతుల్లా చలామణి అవుతున్నారు: మంత్రి బొత్స సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story