జీవో-1 ప్రతులను భోగి మంటల్లో తగులబెట్టిన Chandrababu Naidu

by GSrikanth |   ( Updated:2023-01-14 02:49:35.0  )
జీవో-1 ప్రతులను భోగి మంటల్లో తగులబెట్టిన Chandrababu Naidu
X

దిశ, వెబ్‌డెస్క్: చిత్తూరు జిల్లాలోని నారావారిపల్లె సంక్రాంతి సంబురాలు అంబరాన్నంటాయి. దాదాపు మూడేళ్ల తర్వాత స్వగ్రామంలో జరిగిన భోగి వేడుకల్లో ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనడంతో ఆ ప్రాంతమంతా సంక్రాంతి శోభ సంతరించుకుంది. ఈ వేడుకల్లో నారా లోకేష్‌తో పాటు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. దీంతో చంద్రబాబు, బాలయ్య, లోకేశ్‌ను కలిసేందుకు పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నారావారి పల్లెకు చేరుకున్నారు. వారితో సెల్ఫీలు దిగేందుకు యువకులు ఎగబడుతున్నారు. నారా, నందమూరి ఫ్యామిలీ నారావారి పల్లె రావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, ఈసారి పండగ సంబరాలు అంబరాన్ని అంటినట్లేనని గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భోగి సందర్భంగా చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. జగన్ ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో-1 న చంద్రబాబు భోగి మంటల్లో తగులబెట్టారు.

Advertisement

Next Story