Chandrababu: తరాలు మారినా చెక్కు చెదరని ప్రేక్షకాభిమానం చిరంజీవి సొంతం

by Gantepaka Srikanth |   ( Updated:2024-08-22 12:03:13.0  )
Chandrababu: తరాలు మారినా చెక్కు చెదరని ప్రేక్షకాభిమానం చిరంజీవి సొంతం
X

దిశ, వెబ్‌డెస్క్: పుట్టినరోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ఆసక్తికర పోస్టు పెట్టారు. తరాలు మారినా చెక్కు చెదరని ప్రేక్షకాభిమానం చిరంజీవి సొంతం అని అన్నారు. సినీ ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగి ఎన్నో విజయాలు సాధించారని కొనియాడారు. అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని పేర్కొన్నారు. అంతేకాదు.. ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటి వాటితో ఎంతో మంది పేదలకు ప్రాణదానం చేశారని గుర్తుచేశారు. మంచి నటుడే కాదని.. మానవత్వం ఉన్న మనిషి అని అన్నారు. పేరు సార్థకం చేసుకునేలా ఆయన చిరంజీవిగా ఉండాలని, ఆయనకు భగవంతుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని చంద్రబాబు సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Nara Chandra Babu Naidu Tweet about Megastar Chiranjeevi : https://x.com/ncbn/status/1826543377250140629

Advertisement

Next Story