చిక్కిపోయిన చంద్రబాబు.. జైలు వాతావరణం పడట్లేదా?

by GSrikanth |
చిక్కిపోయిన చంద్రబాబు.. జైలు వాతావరణం పడట్లేదా?
X

దిశ, వెబ్‌డెస్క్: గత మూడు వారాలుగా చంద్రబాబు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేస్తోంది. ఏ ఇద్దరు కలిసినా ఈ అంశం గురించే మాట్లాడుకుంటున్నారు. బాబు అరెస్ట్‌పై ఇప్పటికే దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ ప్రముఖులు సైతం స్పందించారు. కొందరు ఈ వయసులో ఆయనను అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేయడం కరెక్ట్ కాదు అంటుండగా.. చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష పడుతుందని, అందుకు ఇదే నిదర్శనం అని మరికొందరు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాల్ని వ్యక్తపరుస్తున్నారు.

అయితే, ఇదిలా ఉండగా.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు రిమాండ్‌లో ఉన్నారు. ఇప్పటికే పలువురు ఆయనతో ములాఖత్ అయి ఆరోగ్య పరిస్థితి, కేసు వివరాలు తెలుసుకున్నారు. జైలులో వాతావరణం పడక, కేసు విషయం ఆలోచిస్తూ తిన్న తిండి ఒంటికి పడక చంద్రబాబు చిక్కిపోయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని భువననేశ్వరి ములాఖత్ తర్వాత కుటుంబ సభ్యులతో చెబుతూ కంటనీరు పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి అందరికి తెలిసిందే. బెయిల్ కోసం టీడీపీ నాయకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దేశంలోనే ప్రముఖ లాయర్ సిద్దార్థ్ లూథ్రా చంద్రబాబు కేసును వాదిస్తున్నారు.

Advertisement

Next Story