చంద్రబాబు అరెస్ట్.. ఏపీ అసెంబ్లీలో హైటెన్షన్!

by Sathputhe Rajesh |   ( Updated:2023-09-21 03:59:25.0  )
చంద్రబాబు అరెస్ట్.. ఏపీ అసెంబ్లీలో హైటెన్షన్!
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. కాగా చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకులు స్పీకర్ పోడియం వద్ద ఆందోళనకు దిగారు. ఫ్లకార్డులతో తెలుగు దేశం సభ్యులు నిరసనకు దిగారు. టీడీపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభ దద్దరిల్లుతోంది. స్పీకర్ పై టీడీపీ సభ్యులు పేపర్లు విసరడంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. టీడీపీ ఆందోళనల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్ట్ పై చర్చ చేపట్టాల్సిందేనని టీడీపీ నేతలు పట్టు బట్టారు. ఇక చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.

Advertisement

Next Story