చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!

by srinivas |   ( Updated:2024-04-07 12:02:09.0  )
చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో 13న ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీలు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. ఆయా నేతలు ఇప్పటికే భారీ బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒక మోడీ సభ తప్ప మూడు పార్టీ నాయకులు కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. ఎవరికి వారే ప్రజలను కలుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార వూహానికి మరింత పదును పెట్టారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకూ ప్రజాగళం పేరుతో రెండు విడతల్లో చంద్రబాబు పర్యటిస్తున్నారు. అటు పవన్ కూడా వారాహి విజయభేరి పేరుతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

అయితే ప్రజాగళం మూడో విడత ప్రచారాన్ని చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, పవన్ పాల్గొననున్నారు. ఉమ్మడి అభ్యర్థుల కోసం ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకోసం ఉమ్మడి షెడ్యూల్‌ను రెడీ చేశారు. ఈ నెల 10,11న ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. 10న తణుకు, నిడదవోలు, 11న పి.గన్నవరం, అమలాపురం నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. దీంతో టీడీపీ, జనసేన నేతలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభల్లో భారీగా పాల్గొనేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Next Story