ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు

by Javid Pasha |   ( Updated:2023-11-03 07:18:59.0  )
ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో మూడ్రోజుల పాటు వర్షాలు
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉండగా.. ఇది తుఫాన్‌గా మారే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. దీని ప్రభావంతో ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. కోస్తా జిల్లాలపై వాయుగుండం ప్రభావం ఎక్కువా ఉంటుందని, మూడ్రోజుల పాటు వానలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. మత్య్స కారులు సముంద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

మంగళవారం విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం,అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. వాయుగుండం తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నెల 25న తుఫాన్ బంగ్లాదేశ్‌లో తీరం దాటే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఏపీకి తుఫాన్ ముప్పు ముప్పుపై ఇప్పుడే ఏం చెప్పలేమని, వాయుగుండం వల్ల వర్షాలు కురుస్తాయని చెప్పారు. అటు వాయుగుండం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదలేకపోతున్నాయి. దీంతో ఇవి బలపడటానికి మరో వారం రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed