వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం పర్యటన

by M.Rajitha |
వరద నష్టం అంచనాకు కేంద్ర బృందం పర్యటన
X

దిశ, వెబ్ డెస్క్ : రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో ఏపీ(AP) అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. ఏపీలో వరద నష్టం అంచనా వేయడానికి కేంద్ర బృందం గురువారం రాష్ట్రంలో పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖమంత్రి అమిత్ షా(Amith Sha) ఓ ప్రకటన జారీ చేశారు. కేంద్ర విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఓ బృందాన్ని రేపు ఏపీకి పంపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ బృందం వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించి.. వరద, రిజర్వాయర్ నిర్వహణ, భద్రత వంటి పలు అంశాలపై కేంద్రానికి నివేదిక సమర్పించనుంది. కాగా ఏపీలో సంభవించిన ఈ ఉత్పాతాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Nayudu) కేంద్రాన్ని కోరారు. ఇక తెలంగాణలోనూ వర్షాలు, వరదల వల్ల భారీ నష్టం వాటిల్లిందని.. వెంటనే ఏరియల్ సర్వే నిర్వహించి తక్షణ సహాయం చేయాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కోరగా.. అమిత్ షా అనుకూలంగా స్పందించారు. త్వరలోనే కేంద్రమంత్రి ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రాంతాల్లో ఏరియల్ చేయిస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం.

Next Story

Most Viewed