- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP News: విశాఖ-విజయవాడ మధ్య 2 విమాన సర్వీసులు ప్రారంభించిన మంత్రి రామ్మోహన్ నాయుడు
దిశ, వెబ్ డెస్క్: విశాఖపట్నం - విజయవాడ (Vizag - Vijayawada Flights) మధ్య మరో రెండు విమాన సర్వీసులను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. ఇండిగో (Indigo), ఎయిర్ ఇండియా (Air India) ఎక్స్ ప్రెస్ విమాన సర్వీసులు నేటి నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) సర్వీసు ఉదయం 9.35 గంటలకు విశాఖలో బయల్దేరి.. 10.35 గంటలకు విజయవాడ దగ్గర్లోని గన్నవరం విమానాశ్రయం(Gannavaram Airport)కు చేరుతుంది. ఇది తిరిగి రాత్రి 7.55 గంటలకు విజయవాడ నుంచి బయల్దేరి 9 గంటలకు విశాఖకు చేరుతుంది.
అలాగే ఇండిగో సర్వీస్ (Indigo Flight) విజయవాడలో రాత్రి 7.15 గంటలకు ప్రారంభమై.. 8.20 గంటలకు విశాఖకు చేరుతుంది. తిరిగి రాత్రి 8.45 గంటలకు విశాఖలో బయల్దేరి 9.50 గంటలకు విజయవాడకు చేరుతుంది. ఈ కొత్త విమానాలతో విశాఖ - విజయవాడ నగరాల మధ్య తిరిగే విమానాల సంఖ్య 3కి చేరింది. ఈ విమాన సర్వీసులతో విశాఖ - విజయవాడ ప్రయాణికుల కష్టాలు తీరనున్నాయి.