విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గుడ్ న్యూస్.. రూ.11,500 కోట్లతో భారీ ప్యాకేజీ..!

by srinivas |   ( Updated:2025-01-16 15:20:49.0  )
విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గుడ్ న్యూస్.. రూ.11,500 కోట్లతో భారీ ప్యాకేజీ..!
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ స్టీల్ ప్లాంట్‌(Visakha Steel Plant)కు కేంద్రప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు రూ. 11,500 కోట్ల ప్యాకేజీ(Package) ఇచ్చేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ విషయాన్ని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కాగా విశాఖ స్టీల్ స్టీల్ ప్లాంట్ ఆర్థికంగా నష్టాల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ప్లాట్ నిర్వహణలోనూ నష్టాలను ఎదుర్కొంటోంది. దీంతో ఆర్థికంగా సాయం అందించేందుకు కేంద్రం ముందుకు వచ్చింది. గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై చర్చించింది. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ ప్రతిపాదనకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక ప్యాకేజీ అంశానికి సంబంధించి కేంద్రమంత్రి కుమార స్వామి శుక్రవారం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం కాదని గతంలోనే కుమారస్వామి స్పష్టం చేశారు. ఇటు రాష్ట్రం నుంచి కూడా సీఎం, డిప్యూటీ సీఎం పలుమార్లు కేంద్రప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణపై కేంద్ర మంత్రిత్వ శాఖ చాలా సార్లు చర్చించింది.

Advertisement
Next Story

Most Viewed